Devara: జపాన్ లో రిలీజ్ కు సిద్దమైన దేవర 1 y ago
'ఆర్ఆర్ఆర్' సినిమాతో ఎన్టీఆర్ జపాన్ ప్రేక్షకులకు మరింతగా చేరువయ్యారు. ఇక ఇప్పుడు ఆయన కథానాయకుడిగా నటించిన 'దేవర' మార్చి 28న విడుదల కానుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయగా, జాన్వీ కపూర్ కథానాయికగా నటించారు. 'దేవర' ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూనే, ఓవైపు ఎన్టీఆర్ తన కొత్త సినిమా కోసం రంగంలోకి దిగేందుకు సన్నద్ధమవుతున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. మార్చి నెలలోనే ఈ సినిమా చిత్రీకరణ కోసం కెమెరా ముందుకు వెళుతున్నారు. అంటే మార్చి నెలలో ఎన్టీఆర్ బిజీ బిజీ అన్నమాట. ఉగాది సందర్భంగా కానీ, లేదంటే ఎన్టీఆర్ పుట్టినరోజుకి కానీ కొత్త సినిమాకి సంబంధించిన పేరు, లుక్ బయటికొచ్చే అవకాశాలున్నాయి.